- ఉపాధ్యాయురాలి ఉదారత..
- సొంత ఖర్చులతో విందు
నవతెలంగాణ - అశ్వారావుపేట : కార్తీక మాసం అనగానే ఆధ్యాత్మికంగా ఆలయాల్లో దీపారాధనలు, ప్రత్యేక పూజలు.. సామాజికంగా వనభోజనాలు, సామూహిక భోజనాలు గుర్తుకొస్తాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ ఉపాధ్యాయురాలు చూపిన ఉదారత పాఠశాల విద్యార్థుల నోళ్లు తీపి చేసింది.
అశ్వారావుపేట మండలం నారంవారిగూడెం లోని పీఎం శ్రీ యూపీఎస్ లో సోమవారం గణిత ఉపాధ్యాయురాలు ఎల్.రేణుక తన సొంత ఖర్చులతో పాఠశాలలోని విద్యార్థులందరికీ సేమియా పాయసం తయారు చేయించి వడ్డించారు.ఆప్యాయంగా అందించిన పాయసాన్ని విద్యార్థులు ఆనందంగా ఆస్వాదించారు. పండుగ వేళ విద్యార్థులతో సంతోషాన్ని పంచుకోవాలనే ఉపాధ్యాయురాలి చొరవ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)