Magazines

సత్తుపల్లి నర్సింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

7 గంటల క్రితం

Bathukamma
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

- పాల్గొన్నఎమ్మెల్యే రాగమయి దయానంద్‌ 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కృషి బైపాస్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ  జూనియర్ మహిళా నర్సింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు శుక్రవారం రాత్రి కోలాహలంగా జరిగాయి. ఈ వేడుకల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొని విద్యార్థినులతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు, కోలాటం వేశారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, మహిళా కౌన్సిలర్ నసీమా షరీఫ్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థినులు,  ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరై వేడుకలను వీక్షించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్