Magazines

నాడు ట్రైనీ ఎస్‌ఐ.. నేడు అదే స్టేషన్‌కు బాస్.!

9 గంటల క్రితం

SHO SI SAI KISHOR
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

- శిక్షణ పొందిన స్టేషన్‌కే ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు

- అశ్వారావుపేట ఎస్‌హెచ్‌ఓగా విధుల్లో చేరిన సాయి కిశోర్‌రెడ్డి

నవతెలంగాణ – అశ్వారావుపేట 

నాడు శిక్షణ ఎస్‌ఐగా అడుగుపెట్టిన పోలీస్‌ స్టేషన్‌లోనే నేడు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ)గా బాధ్యతలు చేపట్టడం అరుదైన విశేషం. శిక్షణ పొందిన చోటే స్టేషన్‌ బాస్‌గా పగ్గాలు చేపట్టి ఎస్‌ఐ బొగ్గుల సాయి కిశోర్‌రెడ్డి ప్రత్యేకత చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఎస్‌ఐల సాధారణ బదిలీల్లో భాగంగా వీఆర్‌లో ఉన్న సాయి కిశోర్‌రెడ్డిని అశ్వారావుపేట ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. ఆయన గురువారం విధుల్లో చేరారు. ఇక్కడ ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన యయాతి రాజు రెండేళ్ల పదవీకాలం పూర్తికావడంతో బదిలీ చేసి వీఆర్‌లో ఉంచారు.


సాయి కిశోర్‌రెడ్డి 2020 బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఐ. 2021 ఆగస్టులో అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో శిక్షణ ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఉత్తమ పనితీరు కనబరచడంతో అదే స్టేషన్‌లో అదనపు ఎస్‌ఐగా పోస్టింగ్‌ పొందారు. అనంతరం ములకలపల్లి, దమ్మపేట పోలీస్‌ స్టేషన్లలో ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా శిక్షణ పొందిన అశ్వారావుపేట స్టేషన్‌కే ఎస్‌హెచ్‌ఓగా తిరిగి రావడం విశేషం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్