Magazines

నాకాఫ్ కాంట్రాక్ట్ సంస్థను రద్దు చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

2 గంటల క్రితం

Knockoff
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

- హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్

నవతెలంగాణ - కామారెడ్డి

హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు, నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్న నాకాఫ్ కాంట్రాక్ట్ సంస్థను తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగరపు రజనీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులకు ఈ మేరకు వినతిపత్రాలు అందజేశారు.


ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. నాకాఫ్ సంస్థ హాస్టళ్లకు నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్నారని, సెంట్రల్ పర్చేజ్ విధానం పేరుతో మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు సరుకులు కొనుగోలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. మెస్ ఛార్జీలు పెంచామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, హాస్టళ్లలో ఎక్కడా పూర్తిస్థాయిలో మెనూ అమలు కావడం లేదన్నారు.


విద్యార్థులకు గుడ్లు, చికెన్, కూరగాయలు సైతం సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నాకాఫ్ సంస్థ కాంట్రాక్టును రద్దు చేసి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు జి. వెంకటేష్, నిపుణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్