Magazines

నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి

05 అక్టోబర్, 2026

Narayanapet
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - దామరగిద్ద
నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్‌, అరుణ్‌లు అన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను అందించాలని మండల పరిధిలోని అయ్యవారిపల్లి, దేశాయిపల్లి, ముస్తాపేట్ గ్రామాల రైతులు సోమవారం క్యాతన్‌పల్లి విద్యుత్‌ ఉపకేంద్రం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓ వైపు వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోతుంటే.. మరోవైపు వ్యవసాయానికి సరిపడా విద్యుత్‌ను అందించకుండా ప్రభుత్వం రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. తక్ష‍ణమే ప్రభుత్వం స్పందించి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. నారాయణ పేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రోషలప్ప, రైతులు చెన్నప్ప, బాలవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గోవిందు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్