నవతెలంగాణ-నవాబుపేట
నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగో రోజు పర్వతాపూర్ మైసమ్మ దేవత శాఖాంబరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకర్లపాడు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ భక్తుల ఆధ్వర్యంలో నాలుగవరోజు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిమాన్విత దేవత మహిమగల తల్లి మైసమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి సేవలో పాల్గొనాలని సూచించారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్యాంసుందర్ ఆచారి సిబ్బంది గోపాల్ మల్లేష్ అంజి అనసూయమ్మ మురుగని వెంకటయ్య భీమయ్య భారతమ్మ జంగమ్మ పాల్గొన్నారు.






కామెంట్లు (0)