Magazines

బంజారాహిల్స్‌లో వ్యక్తి దారుణ హత్య..

9 గంటల క్రితం

murder
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026 | 1 నిమిషాల చదవడం

- పాత కక్షల నేపథ్యంలో కత్తితో దాడి.. సాగర్‌ సొసైటీలో ఘటన

నవతెలంగాణ-బంజారాహిల్స్‌ : బంజారాహిల్స్‌లోని సాగర్‌ సొసైటీ మైదానంలో శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు కత్తితో దాడి చేయడంతో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో సాగర్‌ సొసైటీ ప్రాంతంలో కలకలం రేగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పాతబస్తీ మల్లాపూర్‌కు చెందిన ఫారూఖ్‌ (28)ను అతని స్నేహితుడు హైమన్‌ పాషా కత్తితో పొడిచి హత్య చేశాడు. గతంలో ఫారూఖ్‌ నిందితుడికి గంజాయి విక్రయించేవాడని, ప్రస్తుతం గంజాయి ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య సుమారు ఎనిమిది నెలలుగా వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గతంలో ఫారూఖ్‌ కత్తితో దాడి చేయడంతో హైమన్‌ పాషా తీవ్రంగా గాయపడ్డాడు. అప్పట్లో టోలీచౌకికి చెందిన కొందరు పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు సమాచారం.

శనివారం గంజాయి విషయమై సాగర్‌ సొసైటీ ప్రాంతంలోని తినుబండారాల దుకాణం వద్దకు ఇద్దరూ వచ్చారు. అక్కడ సమీపంలోని చెట్టు వద్ద మద్యం సేవించిన అనంతరం మాట్లాడుకుంటూ వెళ్తున్న క్రమంలో కత్తితో దాడి జరిగినట్లు సమాచారం అందిందని అడిషనల్‌ డీసీపీ శ్రీకాంత్‌ తెలిపారు. ఘటనాస్థలానికి చేరుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ సుహాసన్‌, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌, క్లూస్‌ టీమ్‌ సిబ్బంది దర్యాప్తులో పాల్గొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్