Magazines

కనీస వేతనాల జీవో 6ను అన్ని పరిశ్రమల్లో అమలు చేయాలి: సీఐటీయూ

11 గంటల క్రితం

CITU
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సంగారెడ్డి 

కనీస వేతనాల జీవో 6 అన్ని పరిశ్రమల్లో అమలు చేయాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం జీవో 6ను జిల్లాలోని అన్ని యాజమాన్యాలు అమలు చేయాలని, దసరా లోపు బోనస్ చెల్లించాలని పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మే 30న రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను సవరిస్తూ జీవో 6 ను విడుదల చేసిందని గుర్తు చేశారు.


ఈ జీవో ప్రకారం పరిశ్రమలో కార్మికులు వేతనాలు, చట్టపరమైన సౌకర్యాలకు నోచుకోవడం లేదన్నారు. ఎన్నికల హామీ ప్రకారం కనీస వేతనాలను శాస్త్రీయంగా సవరించలేదని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.42000గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనేక పరిశ్రమల్లో ఈఎస్ఐ, పిఎఫ్ అమలు కావడం లేదన్నారు. ప్రతి కార్మికుడికి ఈఎస్ఐ పీఎఫ్ 8 గంటల పని ఓటి సెలవులు ఇతర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని రద్దయ్యే వరకు కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి. సాయిలు జిల్లా ఉపాధ్యక్షులు పి. బాగా రెడ్డి, నాయకులు ప్రసన్నారావు, పరమేశ్వర్, రాందాస్, మల్లారెడ్డి, వీరేశం, రామ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అమర్, రమేష్, వేణు కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్