నవతెలంగాణ - వలిగొండ
పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్లో లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించడం ద్వారా ఆహార భద్రతకు భరోసా కల్పించడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందేందుకు వీలవుతుందని అన్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద కుటుంబాలు తమ ఆడపిల్లల వివాహాల విషయంలో ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 68 మంది అర్హులైన లబ్ధిదారులకు మొత్తం రూ.68,07,888/- విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గరిసె రవి, స్థానిక వలిగొండ సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని సహాదేవ్ గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు,గ్రామ సర్పంచులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)