నవతెలంగాణ- ఆత్మకూర్ (m)
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని నర్సాపురం గ్రామ పంచాయితీ ఆవాస గ్రామమైన పిసరి వారి గూడెంలో గురువారం అతిరద్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో నెలకొల్పబడిన మత్స్యగిరి బయోగ్యాస్ కంపెనీకి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ బయోగ్యాస్ కంపెనీని గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పబడడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని దీని ద్వారా ఎంతో మంది రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు గ్రామీణ యువతకు పట్టణాలకు వెళ్లకుండా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు. ఈ యొక్క బయోగ్యాస్ కంపెనీలు తెలంగాణలో 25 ఆంధ్రాలో 25 నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టామని మొట్టమొదటి బయోగ్యాస్ కంపెనీ మత్యాద్రి పుణ్యక్షేత్ర పరిధిలో ప్రారంభించడం శుభ సూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో భూమి యజమాని పిసరి వెంకట్ రెడ్డి, సాయికుమార్ , బాలకృష్ణ కేశవ్, సర్పంచ్ లు కావటి మంజుల ఉప్పలయ్య, సామ సరస్వతి రామ్ రెడ్డి, జక్కల వెంకటయ్య, కావటి లింగస్వామి, బంగపట్ల నరహరి,మంటపల్లి సుధాకర్ , పీసరి శ్రీనివాస్ రెడ్డి ,గ్రామ ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)