Magazines

మత్స్యగిరి బయోగ్యాస్ కంపెనీకి భూమిపూజ

8 గంటల క్రితం

Matsyagiri Biogas Company
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - వలిగొండ

మండల పరిధిలోని నర్సాపురం గ్రామ పంచాయితీ ఆవాస గ్రామమైన పిసరివారి గూడెంలో గురువారం మత్స్యగిరి బయోగ్యాస్ కంపెనీకి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ.. బయోగ్యాస్ కంపెనీని గ్రామీణ ప్రాంతంలో నెలకొల్పబడడం ఎంతో సంతోషకరమని, దీని ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అన్నారు.


ఈ కంపెనీలను తెలంగాణలో 25, ఆంధ్రాలో 25 నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. మొట్టమొదటి బయోగ్యాస్ కంపెనీ మత్యాద్రి పుణ్యక్షేత్ర పరిధిలో ప్రారంభించడం శుభ సూచకమని అన్నారు. కార్యక్రమంలో భూమి యజమాని పిసరి వెంకట్ రెడ్డి, సాయికుమార్ , బాలకృష్ణ కేశవ్, సర్పంచ్ లు కావటి మంజుల ఉప్పలయ్య, సామ సరస్వతి రామ్ రెడ్డి, జక్కల వెంకటయ్య, కావటి లింగస్వామి, బంగపట్ల నరహరి,మంటపల్లి సుధాకర్ , పీసరి శ్రీనివాస్ రెడ్డి ,గ్రామ ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్