Magazines

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే షిండే

2 రోజుల క్రితం

hanmanth Shinde
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

జుక్కల్ నియోజకవర్గం, మద్నూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ (సమీకృత పాఠశాల) భవన నిర్మాణ పనులను బిఆర్ఎస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గ నాయకులు, మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ నాణ్యతపై మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  కాంట్రాక్టర్లకు, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.


ముఖ్యంగా ప్రస్తుతం 'ఎల్ నినో' ప్రభావం కారణంగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవని, వాతావరణం పొడిగా ఉన్నందున భవన నిర్మాణంలో 'క్యూరింగ్' ప్రక్రియను అత్యంత నిశితంగా, నిరంతరం నిర్వహించాలని సూచించారు. సరైన క్యూరింగ్ ఉంటేనే భవనం పటిష్టంగా ఉంటుందని పేర్కొంటూ పనుల్లో ఎలాంటి అలసత్వం వహించకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే వెంటా బిఆర్ఎస్ మండల నాయకులు బన్సీ పటేల్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నాయకులు కృష్ణ పటేల్, సుల్తాన్ పేట్ సర్పంచ్ రాజేశ్వర్గౌడ్, కాశీనాథ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్