నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని చిన్న ఎక్లారాలో బుధవారం నిరుపేద దళిత మహిళ మృతి చెందింది. విషయ తెలుసుకున్న సర్పంచ్ మాధవరావు, ఉప సర్పంచ్లు సంయుక్తంగా మృతురాలి అంత్యక్రియల నిమిత్తం రూ. 5,100/- కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మృతురాలి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అత్యవసరం మేరకు అంత్యక్రియలకై ఆర్థిక సాయం అందించామని చెప్పారు.





కామెంట్లు (0)