నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆ సంఘ అధ్యక్షులు కల్లూర్వార్ అశోక్, ఉపాధ్యక్షులు ఎంజప్వార్ చిన్న, వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కల్లూరు వార్ అశోక్, ఉపాధ్యక్షులు ఎంజప్ వార్ చిన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, యాదవ్ సంఘం నాయకులు మాజీ ఎంపిటిసి కర్రే వార్ రాములు, ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకులు నాందేవ్ మేస్త్రి, రామ్ చందర్, మధు, ముదిరాజ్ సంఘం సభ్యులు కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)