Magazines

ఘనంగా పెరుమాండ్ల గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు

3 రోజుల క్రితం

birthday
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నెల్లికుదురు

మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరుమాండ్ల గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. శనివారం కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్ష‍లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన యుద్ధనౌక మారోజు వీరన్న కుమార్తె దిశా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


ఈ సందర్భంగా  మహబూబాబాద్ మాజీ సర్పంచ్ భూక్య నెహ్రూ నాయక్, ట్రైబల్ జేఏసీ నాయకులు రవీందర్ రాథోడ్, సురేష్ నాయక్, భాస్కర్ నాయక్, నరేష్ నాయక్, లక్ష్మణ్ ముదిరాజ్‌తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఈ వేడుకల్లో పాల్గొని పెరుమాండ్ల గుట్టయ్యగౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.


అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం రైతన్నల సమస్యలపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి గుట్టయ్య గౌడ్ అని పేర్కొన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషుల పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్