Magazines

శాత్రజ్ పల్లిలో కూల్చిన ఇండ్లకు రక్షణ కల్పించండి

1 గంట క్రితం

Shatraj Pally
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

బాధిత నిర్వాసితుల విజ్ఞప్తి

నవతెలంగాణ - మల్హర్ రావు

అక్టోబర్ 10న అర్ధరాత్రి రెవెన్యూ, ఫారెస్టు, సింగరేణి, అగ్నిమాపక అధికారులు అక్రమంగా కుల్సిన ఇండ్లకు రక్షణ కల్పించాలని బాధిత నిర్వాసితులు గడ్డం తిరుపతి యాదవ్, చొప్పరి సారయ్య, చిగురు తిరుపతి, ఈర్ల సంపర్, ఉదరి రమేష్, ఆకుల రాజేష్, ముద్రవేన లక్ష్మయ్య, దండపల్లి సధి, గొస్కుల ప్రశాంత్, చొప్పరి రాజేందర్, సుంకరి చెంద్రయ్య విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం వారు మాట్లాడారు. తాము కాయకష్టం చేసుకొని కూడబెట్టిన డబ్బులతో ఇండ్లు నిర్మాణం చేపడితే ఇండ్లను కూల్చడంతో రాత్రివేళల్లో కొందరు ఇండ్ల కట్టెను, ఇటుకల చోరీకి పాల్పడడంతో తమకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా కూల్చిన ఇండ్లకు నష్టపరిహారం వచ్చే వరకు కూల్చిన అధికారులే రక్షణ కల్పించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్