- రిషి, సౌమ్య ప్రతిభకు రాష్ట్ర స్థాయి గుర్తింపు
నవతెలంగాణ - రాయపోల్
రాయపోల్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, మండలానికి గర్వకారణంగా నిలిచారు.ఈ నెల 2న సంగారెడ్డిలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రాయపోల్ విద్యార్థులు రిషి, సౌమ్య రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు గోవర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాల నుంచి రిషి, సౌమ్య వాలీబాల్ రాష్ట్ర స్థాయి జట్లకు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు.ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో నిర్వహించనున్న 70 వ ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. క్రీడల్లో ప్రతిభను చాటుతూ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందించి, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రదర్శన కనబరిచి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)