- అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న నాయకుడిగా కొనియాడిన బీఆర్ఎస్ శ్రేణులు
- అశ్వారావుపేటలో కేక్ కట్ చేసి సంబరాలు
నవతెలంగాణ - అశ్వారావుపేట : బహుజన సమాజ హక్కుల సాధన, అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను సోమవారం అశ్వారావుపేట పట్టణ బీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి జుజ్జరపు శ్రీరామ్మూర్తి నివాసంలో కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..
పోలీసు అధికారిగా విశేష సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం ప్రజా జీవితంలోకి ప్రవేశించి బహుజనుల హక్కుల సాధన కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్య, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాలకు సమాన అవకాశాల కల్పన కోసం ఆయన సాగిస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అణచివేతకు గురైన వర్గాల హక్కుల కోసం ఆయన చేస్తున్న కృషి మరెందరికో ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ డాక్టర్ ఉదయ జ్యోతి, పట్టణ మాజీ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ, మొటూరి మోహన్, తగరం జగన్నాథం, నార్లపాటి చిన్న అబ్బాయి, జుజ్జరపు రాంబాబు, నార్లపాటి అశోక్, బొడ్డపాటి ఉదయ్ తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజా జీవితంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.





కామెంట్లు (0)