Magazines

యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన

12 నిమిషాల క్రితం

IMG_20261123_112443
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

- నిర్మాణ సామగ్రి నాణ్యతను తనిఖీ చేసిన ఎన్ఏసీ నిపుణులు

నవతెలంగాణ - అశ్వారావుపేట : అశ్వారావుపేటలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను సోమవారం థర్డ్ పార్టీ నాణ్యత నియంత్రణ నిపుణులు పరిశీలించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) క్వాలిటీ కంట్రోల్ నిపుణులు ఎన్. సత్యనారాయణ నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేశారు. నిర్మాణానికి వినియోగిస్తున్న ఇనుము, ఇసుక, మట్టి నాణ్యతను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా లేదా అని తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉపయోగించే ప్రతి సామగ్రి నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా పరిశీలించారు. ఆయన వెంట ఈడబ్ల్యూఐడీసీ ఈసీ సాంబయ్య, ఏఈ రాం కుమార్, ప్లాంట్ మేనేజర్ శ్రీనివాస్ లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్