Magazines

బైరంపల్లి పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, బీరువా వితరణ

15 నిమిషాల క్రితం

ups bharampally
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ మిడ్జిల్  : మండలంలోని బైరంపల్లి  గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గ్రీన్ మేకర్స్ అసోసియేషన్ ఆమన్గల్ ఆధ్వర్యంలో సోమవారం భోజన ప్లేట్లు మరియు పాఠశాల అవసరాల కోసం ఒక బీరువాను వితరణ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు సతీష్ మాట్లాడుతూ , ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కనీస వసతులు కల్పించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను, అందించాలని విద్యార్థులకు అర్థమైన రీతిలో పాఠాలను బోధించాలని కోరారు.  ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ముందుకు వచ్చిన గ్రీన్ వెల్స్ అసోసియేషన్ సభ్యులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డానింగ్ టన్ , గ్రీన్ మేకర్స్ అసోసియేషన్ , జనరల్ సెక్రటరీ శ్రీను సభ్యులు సుధాకర్, సురేష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి , పాఠశాల ఉపాధ్యాయులు పూర్ణ, మంజుల , శ్రావణి  అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్