- ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్-2026లో మట్టా స్వామి గౌడ్ అద్భుత ప్రతిభ
- విద్యార్థిని, తల్లిదండ్రులను అభినందించిన స్కూలు యాజమాన్యం
నవతెలంగాణ-సత్తుపల్లి : ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్‌షిప్-2026లో సత్తుపల్లి నారాయణ పాఠశాలకు చెందిన మట్టా స్వామి గౌడ్ తన అద్భుత ప్రతిభతో సత్తా చాటి పాఠశాలకు గర్వకారణంగా నిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం రాంకీ, ఆర్ఐ క్రాంతి విద్యార్థి స్వామి గౌడ్ ను అభినందించారు. అతని కృషి, పట్టుదల, క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని కొనియాడారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం ఎంతో అభినందనీయమని పాఠశాల ప్రిన్సిపాల్ రామ్మూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ బృందం స్వామి గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం వెనుక విద్యార్థి కృషితో పాటు నిరంతరం వెన్నుతట్టి ప్రోత్సహించిన తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని పేర్కొంటూ యాజమాన్యం వారిని అభినందించింది. విద్యార్థుల్లోని అంతర్గత ప్రతిభను గుర్తించి, చదువుతో పాటు క్రీడల్లోనూ ఉన్నత శిఖరాలకు చేర్చడమే నారాయణ పాఠశాల ప్రధాన లక్ష్యమని పాఠశాల యాజమాన్య బాధ్యులు అన్నారు. స్వామి గౌడ్ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.





కామెంట్‌లు (0)