- ముంపు ప్రాంతాల పరిశీలన
- మున్సిపల్ కమిషనర్‌కు వైస్ చైర్మన్ ఆదేశాలు
- వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఏర్పడిన ముంపు పరిస్థితుల నేపథ్యంలో పారిశుధ్య నిర్వహణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని పలు ముంపు ప్రాంతాలను ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పరిశీలించారు.
ఒకటో వార్డులోని పుట్టినరోజు ప్రాంతం, రెండో వార్డులోని దొంతికుంట కాలనీ, మూడో వార్డులోని చిన్నంశెట్టి బజార్‌తో పాటు 15వ వార్డులో పర్యటించారు. ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు.
గౌడ బజార్, వడ్డెర బజార్, కన్యకా పరమేశ్వరి ఆలయం పరిసరాలు, మంగళ బజార్ తదితర ప్రాంతాల్లో వరద నీరు తగ్గిన అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు.
నీట మునిగిన ఇళ్లు, రహదారులు, కాలనీల పరిసరాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించి, చెత్తను వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో నిల్వ నీటి కారణంగా దోమలు, ఇతర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నందున పారిశుధ్య సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రమేష్‌బాబు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలను అత్యవసరంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు డేరంగుల ప్రసాద్,దగ్గుమిల్లి నరేంద్ర,మోర్ల వెంకన్న,కాంగ్రెస్ నాయకులు చిన్నంశెట్టి సత్యనారాయణ,తుమ్మ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)