Magazines

జాతీయ ఉత్తమ సర్పంచ్ గా సంతోష్ యాదవ్

4 గంటల క్రితం

Best Sarpanch
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

జాతీయ ఉత్తమ సర్పంచ్ గా మండలంలోని యరగండ్లపల్లి గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ ఎంపికయ్యారు. ఈ నెల15 న ఢిల్లీలో బహుజన సాహిత్య అకాడమీ వారు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో సంతోష్ యాదవ్ జాతీయ ఉత్తమ సర్పంచ్ పురస్కారాన్ని అందుకోనున్నారు. గ్రామ అభివృద్ధితో పాటు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆయన చేపట్టిన పలు అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ఆయన కు గుర్తింపునిచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ గ్రామ అభివృద్ధికి, ప్రజా సేవకు మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. జాతీయ ఉత్తమ సర్పంచ్ పురస్కారం లభించడం పట్ల సంతోష్ యాదవ్ ను గ్రామ ప్రజలతోపాటు పలువురు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్