Magazines

చెట్టు కూలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం

4 గంటల క్రితం

Software employee dies
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 18, 2026 | 1 నిమిషాల చదవడం

కుంట్లూరు రాజీవ్ గృహకల్ప సమీపంలో విషాద ఘటన

నవతెలంగాణ - నాగోల్

ఎండిపోయిన చెట్టు హఠాత్తుగా కూలి మీద పడటంతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగోల్ నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ ఎగ్జిట్‌-10కు వెళ్లే రేడియల్ రోడ్డులోని కుంట్లూరు రాజీవ్ గృహకల్ప సమీపంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నాగోల్ పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ తెలిపారు.


పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీ వెంకటేశ్వర కాలనీ, ఇందు అరణ్యకు చెందిన వి. సాయికుమార్ (29) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుంట్లూరు రాజీవ్ గృహకల్ప సమీపంలో వెళ్తుండగా ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా కూలి అతనిపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.


స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను అడిగి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహమ్మద్ మక్బూల్ జానీ వెల్లడించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్