Magazines

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: తహసీల్దార్

6 రోజుల క్రితం

land issues
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తొగుట

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతులకు స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పించడమే భూ భారతి పైలట్ ప్రోగ్రాం రీ - సర్వే ప్రధాన లక్ష్యమని తహసీల్దార్ సమీర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. బుధవారం మండలంలో లింగం పేట గ్రామంలో సర్పంచ్ గొడుగు జయమ్మ అధ్య క్షతన నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొని రీ-సర్వే విధివిధానా లపై రైతులకు అవగాహన కల్పించారు. డ్రోన్లు, ఉపగ్రహ చిత్రాలు, డీజీపీఎస్, ఆధునిక రోవర్ యంత్రాల ద్వారా భూముల హద్దు లను కచ్చితం గా గుర్తిస్తామని వివరించారు.


గ్రామ శివారు హద్దుల నుంచి ప్రభుత్వ భూములు, కబ్జా భూములు, గ్రామకంఠం భూములు, అనంతరం పట్టా భూములను దశలవారీగా సర్వే చేస్తారని తెలిపారు. భూ యజమానులు, పొరుగు రైతుల సమక్షంలోనే భూముల కొలతలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రైతులు రీ-సర్వే ప్రక్రియకు సహకరిం చి తమ భూములకు సంబంధించిన వివరాలను అధికారులకు అందించాలని కోరారు. సేకరించిన వివరాల ను ల్యాండ్ పార్సిల్ మ్యాపులో గ్రామ రెవిన్యూ నక్షలు రూపొందించి గ్రామసభలలో ప్రదర్శిస్తారని తెలిపారు. రైతుల అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించిన తర్వాతే తుది రికార్డ్ ఖరారు చేస్తారన్నారు.


సర్వే పూర్తయిన ప్రతి భూకమ తానికి ప్రత్యేక భూదారి నెంబర్ కేటాయించి క్యూ ఆర్ కోడ్ తో కూడిన పట్టాదారు పాసుబుక్కులు జారీ చేస్తారని వివరించారు. సర్వే పురోగతిపై ఎప్పటి కప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారని, రికార్డుల్లో తప్పులు ఉంటే ఆర్డీవో, కలెక్టర్, ల్యాండ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చు అని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్