నవతెలంగాణ - అమీన్‌పూర్
అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని సాయి రాజేశ్వరి కాలనీలో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన నూతన ‘టీపీఆర్ భారత్ పెట్రోల్ పంప్’ను అమీన్‌పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం తొలి వాహనంలో పెట్రోల్ నింపి లాంఛనంగా సేవలను మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. స్థానిక వాహనదారులు ఇంధనం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే శ్రమ లేకుండా, రహదారులపై ప్రయాణాలు సాఫీగా సాగేందుకు గాను అన్ని వసతులతో ఈ రెండో బ్రాంచ్‌ను ఇక్కడ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. స్థానికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజేశ్వరి కాలనీలో ఈ నూతన పెట్రోల్ బంక్‌ను ప్రారంభించామని స్పష్టం చేశారు. నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌తో పాటు ఖచ్చితమైన కొలతలతో వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)