Magazines

దసరాకు కొత్త పింఛన్ లేనట్టేనా.?

14 గంటల క్రితం

Pensions
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 2 నిమిషాల చదవడం

నాలుగేళ్లుగా తప్పని ఎదురు చూపులు

మండలంలో 496 దరఖాస్తులు

నవతెలంగాణ - మల్హర్ రావు

నాలుగేళ్లుగా ఆసరా, కొత్త పింఛన్ల మంజూరు లేక అర్హులైన ఎంతోమంది లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పటంలేదు. అర్హులందరికీ దసరా నుంచి ఆసరా పింఛన్లు ఇస్తామంటూ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు నెలరోజుల పాటూ ఆన్లైన్ దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు మండలంలో 496 మంది దరఖాస్తులు చేసుకోగా..వృద్ధాప్య పింఛను అవకాశం ఇవ్వకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు దారులకు సైతం పింఛను ఎప్పటి నుంచి మంజూరు చేస్తారనేది స్పష్టతలేదు. మండల వ్యాప్తంగా పలు రకాల పింఛన్లు 3,680 వీరికి ప్రతినెలా దాదాపు రూ.7 లక్షల పంపిణీ చేస్తున్నారు.


కాగా, గత 2022లో ఆఖరిసారి పింఛన్ల పథకం మంజూరు చేయగా ఇప్పటికి నాలుగేళ్లవుతున్నా, కొత్త పింఛన్లు మంజూరు చేయటం లేదు. ఈ ఏడాది దసరాకు కొత్తపింఛన్లు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించగా నూతన పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో వితంతు, ఒంటరి, దివ్యాంగులు, పైలేరియా, బోదకాలు, చేనేత, గీతకార్మికులు కలిపి మొత్తం 7 రకాల పింఛన్ దారులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ వారికి ఎప్పటి నుంచి పింఛన్లు మంజూరు చేస్తారనేది తెలియడం లేదు.


వృద్ధాప్య పింఛన్కు నోఛాన్స్!

నాలుగేళ్ల నుంచి కొత్తవారికి పింఛన్లు ఇవ్వకపోగా ప్రస్తుతం ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు నెలరోజు లపాటు పింఛన్లకు అర్హులైన కొత్తవారు దరఖా స్తులు చేసుకోవాలంటూ ప్రభుత్వం ప్రకటించింది. అందులో వృద్ధాప్య పింఛన్దారులకు అవకాశం ఇవ్వకపోవటంతో ఎంతోమంది వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో 2022లో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ ఇచ్చారు. నాలుగేళ్ల కాలంలో 57 ఏళ్లు నిండినవారు వెయ్యి పైచిలుకు మంది ఉన్నట్లు తెలిసింది. వారందరూ తాము దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వక పోవటం ఎంతవరకు సమంజసమని ఆవే దన చెందుతున్నారు.

ఆదేశాలు రాలేదు..క్రాంతి కుమార్ ఎంపిడిఓ

మండలంలో కొత్తగా 496 మంది కొత్తగా పింఛన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వృద్ధాప్య పింఛన్దారులకు అవకాశం లేదు. కాగా.. నూతన దరఖాస్తుదారులకు ఎప్పటి నుంచి పింఛన్లు మంజూరవుతాయనే విషయంపై మాకు సమాచారం లేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్