మండలంలో 75 శాతం పూర్తి
నవతెలంగాణ - మల్హర్ రావు
ఖరీఫ్ సీజన్ లో ఏయే రైతులు తమ భూముల్లో ఏ పంటలు సాగు చేశారనే లెక్కలు ఇంకా తేలలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు డిజిటల్ క్రాప్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నాయి.ఇందులో భాగంగా గ్రామానికి ఒక వాలంటీర్ మొత్తం 18 రెవెన్యూ గ్రామాలకు,18 వాలింటర్లను నియమించారు. ఆయా గ్రామ పరిధిలో రైతుల సాగు భూమిని సందర్శించి వాళ్లు ఏ పంట సాగు చేశారనే సమాచారంతో పాటు ఫొటో తీసి యాప్లో నమోదు చేయాలి. పంటల నమోదుకు సెప్టెంబరు 30 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది.అధికారులు మాత్రం గడువు ఇంకా ఉందని చెప్పడం గమనార్హం. మండలంలో 75 శాతం పూర్తి కాగా,25 శాతం మిగిలి ఉంది. ఇప్పటికే వరి కోత దశలో ఉంది.పత్తి పంట చేతికి వస్తోంది. సకాలంలో పంటల నమోదు పూర్తి కాకపోతే పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
సంకేతాలు అందక జాప్యం..
మండలంలో 21,196 వేల సర్వే నంబర్లలో రైతులు పంటలు సాగు చేశారు.ఇప్పటి వరకు ఏయే సర్వే నంబర్లలో ఏయే పంటలు సాగు చేశా రనేది నమోదు చేశారు.గ్రామాల వా మరో 196 సర్వే నంబర్లలో నమోదు చేస్తే వంద శాతం పూర్తయ్యే అవకాశం ఉంది.
సెప్టెంబరు 30 ముగిసిన గడువు
మండలంలో 21,196 సర్వే నంబర్లు ఉంటే ఇప్పటి రెండు వేల వరకు సర్వే నంబర్లు ఉంటే కేవలం 196 సర్వే నంబర్లలో ఏయే పంటలు సాగు చేశారనేది నమోదు చేశారు.గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయ భూములు అటవీ ప్రాంతాలు,గుట్టలపై ఉండటం,రైతులు అందుబాటులో లేకపోవడం, సర్వే సమయంలో సిగ్నల్ రాకపోవడంతో నమోదులో కొంత జాప్యమవుతోందని అధికారులు పేర్కొంటున్నారు.






కామెంట్లు (0)