మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు
నవతెలంగాణ-మద్నూర్
పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ మండలాధ్యక్షులు ధరాస్ సాయిలు అన్నారు. బుధవారం మండలంలోని హెచ్ కేలూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ జి లక్ష్మణ్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ధరాస్ సాయిలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలోనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో నమోదు చేసుకుని లబ్ది పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఈ పథకానికి సూపర్వైజర్ గా విధులు నిర్వహించిన ఏపిఎం జగదీష్ కుమార్, గ్రామ ఉపసర్పంచ్ పంచాయతీ పాలకవర్గం సభ్యులు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంతోష్ పటేల్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొండ గంగాధర్, మాజీ ఎంపిటిసి విజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తోట నాగనాథ్, మాజీ ఉపసర్పంచ్ ఏక్నాథ్, గ్రామ కార్యదర్శి లక్ష్మణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)