Magazines

ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి

56 నిమిషాల క్రితం

Attack on a commercial vessel off the coast of Oman
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

భారత 
నావికుడి మృతి

13 మంది సిబ్బంది సురక్షితం

న్యూఢిల్లీ : ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో మన దేశానికి చెందిన నావికుడొకరు మరణించారు. కేంద్ర షిప్పింగ్, నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, విదేశాంగ శాఖ మంగళవారం అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించాయి. నౌకలో మొత్తం 14మంది సిబ్బంది ప్రయాణిస్తుం డగా వారంతా భారతీయులే. దాడి జరిగిన తర్వాత ఒమన్ తీర గస్తీ దళానికి చెందిన సిబ్బంది వెంటనే స్పందించి మిగిలిన 13 మంది నావికులను రక్షించారు. మరణించిన నావికుడిని గుజరాత్‌కు చెందిన గంధార్ నహీమ్ అజీజ్‌గా గుర్తించారు. దాడి జరిగిన అనంతరం ఆయనను ఒమన్‌లోని ఖసబ్ పోర్ట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమ ధ్యంలోనే చనిపోయారు.

యూఏఈలోని హమ్రియా ఓడరేవు నుంచి గుజరాత్‌లోని పోర్‌బందర్ వైపు భారత పతాకంతో వస్తున్న ‘ఎంఎస్‌వీ అల్ జుసుఫీ’ వాణిజ్య నౌకపై సోమవారం ఒమన్ తీరంలోని లిమా సమీపంలో దాడి జరిగింది. డ్రోన్ లేదా క్షిపణి తరహా వైమా నిక సాధనంతో దాడిచేసి ఉంటారని భావిస్తున్నా రు. కాగా మృతుని దేహాన్ని, సురక్షితంగా బయట పడిన నావికులను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒమన్‌ లోని భారత రాయబార కార్యాలయం అక్కడి స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదిం పులు జరుపుతోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, హౌతీల దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకల పై దాడులు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

సముద్ర దొంగల నుంచి సిబ్బందిని కాపాడిన నౌకాదళం

సోమాలియా ఈశాన్యతీరంలో సముద్ర దొంగలు హైజాక్ చేసిన నౌకను, అందులోని సిబ్బందిని భారత నౌకాదళం అత్యంత సాహసోపే తమైన ఆపరేషన్‌తో రక్షించింది. ఇరాన్‌కు చెందిన ‘అజిని’ అనే చేపలను వేటాడే నౌకను గత నెల 29న సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ తీరం సమీపంలో సముద్ర దొంగలు అపహరించారు. ఈ నౌకను భారీ నౌకలపై దాడి చేయడానికి వాడుకో వాలని వారు భావించారు. అయితే 48 గంటల పాటు అత్యంత వ్యూహాత్మకంగా, నిరంతరంగా జరిపిన ఆపరేషన్‌లో నౌకలోని 20 మంది సిబ్బంది ని నౌకాదళం రక్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం నౌక,వైమానికదళాలు సంయుక్తంగా రంగం లోకి దిగి అత్యాధునిక సాంకేతికతను, కమాండో లను ఉపయోగించాయి. ఐఎన్ఎస్ కొల్‌కతా యుద్ధ నౌకతో పాటు హైజాక్ అయిన నౌకను గుర్తించేందుకు పీ-81 మేరీటైమ్ పెట్రోల్ విమా నాన్ని, అత్యాధునిక గార్డిన్ డ్రోన్లను రంగం లోకి దింపారు. మార్కోస్ కమాండోలు ఆకాశం నుంచి విమానం ద్వారా సముద్రంలోని నౌకలోకి నేరుగా దిగారు. ఆ తర్వాత నౌక పైకి దూసుకెళ్లి సముద్ర దొంగలను లొంగదీసుకొని సిబ్బందిని రక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్