Magazines

క్షేత్రస్థాయి పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

55 నిమిషాల క్రితం

Revenue Minister Ponguleti Srinivasa Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

పెండింగ్‌ సమస్యల పరిష్కారం..
ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ

తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సమీక్షలు పూర్తి
నేడు రంగారెడ్డి జిల్లా సమీక్ష : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

క్షేత్రస్థాయి పాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతోపాటు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపడంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ, హౌసింగ్, భూ సర్వే శాఖలకు సంబంధించిన అంశాలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకునేందుకు సమీక్షాసమావేశాలు ఉపయోగపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రెవెన్యూ సమస్యలు, గృహ నిర్మాణ పథకాల అమలు, భూ సర్వే పురోగతితోపాటు ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో సమీక్షలు పూర్తి చేసినట్టు వివరించారు. ఇందులో భాగంగా బుధవారం మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా పరిధిలోని షామీర్‌పేటలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌‌చార్జి మంత్రులు కూడా సమీక్షలు హాజరు కావడంతో వెంటనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో రాజధాని వేదికగా రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో ఉమ్మడి జిల్లాల వారీగా శాఖల పనితీరు, సమస్యల పరిష్కారంపై చర్చించినట్టు తెలిపారు. ఆయా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు, క్షేత్రస్థాయిలో సాధించిన పురోగతి, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలపై ప్రస్తుత సమీక్షల్లో ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమస్యలను గుర్తించడమే కాదు... వాటికి పరిష్కారం చూపడం. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా, శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగవంతమయ్యేలా సమావేశాలు దోహదపడతాయని వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్