ప్రయివేట్ ఆస్పత్రుల్లోనే అధికంగా సీజేరియన్లు
తల్లుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
బీమా ఉన్నా చేతి నుంచే ఎక్కువగా ఖర్చు చేస్తున్న వైనం
ప్రాంతాలను బట్టి మారుతున్న సి-సెక్షన్ల సంఖ్య
బీమా సంస్థ ప్లమ్ అధ్యయనంలో వెల్లడి
మాతృత్వం ఓ మధురానుభూతి. దీనిని ప్రయివేట్ ఆస్పత్రులు కాసులవేటగా మార్చుకుంటున్నాయి. ప్రస్తుత రోజుల్లో వైద్యఖర్చులు తడిసి మోపెడవుతుండడం, ఖర్చులు తగ్గించుకోవచ్చనే ఆశతో కుటుంబాలు బీమా సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నాయి. లాభార్జనే ధ్యేయంగా ప్రయివేట్ ఆస్పత్రులు సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నప్పటికీ, లాభాల కోసం సీజేరియన్ ఆపరేషన్లకే మొగ్గు చూపుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. వైద్య అవసరాల కంటే ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న తీరుపై బీమా సంస్థ ప్లమ్ డేటా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ : ఒకప్పుడు గర్భిణీ, కడుపులోని శిశువు ఆరోగ్య పరిస్థితిని బట్టి సాధారణ ప్రసవమా లేదా సిజేరియన్ చేయడమా అని వైద్యులు నిర్ధారించే వారు. కొన్ని పరిస్థితుల్లో గర్భిణీ కడుపులోని శిశువు తల కిందికి లేకపోవడం, ప్లాసెంటా లేదా బొడ్డుతాడుతో సమస్యలు, ఒక కాన్పులో మహిళలు ఎక్కువ మంది పిల్లలను కనడం, తల్లుల్లో అధిక రక్తపోటు తదితర కారణాల వల్ల సిజేరియన్ చేసేవారు. కానీ నేడు కేవలం కాసుల కోసం తల్లీ బిడ్డల ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా ప్రయివేట్ ఆస్పత్రులు సీ-సెక్షన్‌కు సిద్ధమవుతున్నా యి. బీమా సంస్థల నుంచి నగదు క్లెయిమ్ చేసుకుంటున్నా వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ ఉద్యోగులు, వైట్-కాలర్ ఉద్యోగుల ఆస్పత్రి ఖర్చుల క్లెయిమ్‌ల ఆధారంగా బీమా సంస్థ ప్లమ్ ....ఆస్పత్రులలో ప్రసవ సంరక్షణ విధానాలు, ఆస్పత్రుల ఎంపిక, సొంత ఖర్చుల శాతం వంటి అంశాలను పరిశీలించింది. ఇందులో కొన్ని ప్రాంతీయ వ్యత్యాసాలు ఉన్నట్టు తెలిపింది. దేశంలో పెరుగుతున్న సిజేరియన్ల సంఖ్యపై చర్చ పతాక స్థాయికి చేరుకుంటున్న తరుణంలో 1,60,000కు పైగా ప్రసవ సంబంధిత ఆస్పత్రి బీమా క్లెయిమ్‌లపై వచ్చిన కొత్త డేటా ప్రకారం..
ఇలాంటి జననాల సగటు రేటు 69 శాతంతో గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్లమ్ డేటా ల్యాబ్స్ కనుగొన్న గణాంకాలు అధికంగా ఉన్నప్పటికీ, ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 2023-24 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలోని ధోరణులకు ఇవి అనుగుణంగానే ఉన్నాయి. ఆ సర్వే ప్రకారం ప్రయివేట్ రంగంలో జరిగిన ప్రసవాలలో 54 శాతం సిజేరియన్లే. ఇందులో తెలంగాణ 62 శాతం , ఆంధ్రప్రదేశ్ 52 శాతంతో అగ్రస్థానంలో ఉన్నాయి. కోల్‌కతాలోనూ సీ-సెక్షన్ల సంఖ్య 44 శాతం పైగా ఉంది. జామా నెట్వర్క్ ఓపెన్ జర్నల్‌లో ప్రచురితమైన 2005 నుంచి 2016 మధ్య జరిగిన ప్రసవాలపై ఆగస్టు 2020లో జరిపిన ఒక అధ్యయ నం ప్రకారం...ప్రసవం కోసం ఆస్పత్రిని ఎంచుకోవ డం ఒక ముఖ్యమైన అంశమని, ప్రయివేటు ఆరోగ్య సంరక్షణ సంస్థలలోనే ఎక్కువ సీ-సెక్షన్లు జరుగుతు న్నాయని సూచించింది. ముఖ్యంగా నర్సింగ్ హోమ్‌లు, సింగిల్-స్పెషాలిటీ ప్రయివేట్ ఆస్పత్రులు, మల్టీ-స్పెషాలిటీ ఆస్పత్రులు, తల్లి-బిడ్డ స్పెషాలిటీ ఆస్పత్రులలో 67–72 శాతం కేసులలో సీ-సెక్షన్ ప్రసవాలు జరిగాయని డేటా ల్యాబ్స్ అధ్యయనం వెల్లడించింది.
మిషన్ , ట్రస్ట్ ఆస్పత్రులలో 51 శాతం తో పోలిస్తే, మెట్రోయేతర నగరాల్లోని సింగిల్-స్పెషాలిటీ ప్రయివేట్ ఆస్పత్రులలో అత్యధికంగా 72–73 శాతం రేటు నమోదైంది. అయితే ప్లమ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సౌరభ్ అరోరా వివరించిన ప్రకారం.. గర్భధారణ మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, ఇతర ముందస్తు అనారోగ్య పరిస్థితులు, తల్లి బరువు, గతంలో సి-సెక్షన్ చేయించుకున్నారా లేదా అనే క్లినికల్ అంశాల ఆధారంగా ప్రసవం సి-సెక్షన్ ద్వారా జరుగుతుందా లేదా అనేది నిర్ణయించబడుతుందని తెలిపారు. మరికొన్ని ‘‘కుటుంబాలు తేదీలను , శుభ సమయాలను ఎంచుకుంటున్నట్టు ప్లమ్కు అనధికారికంగా తెలిసింది. కానీ ఆ సమాచారం క్లెయిమ్ పత్రంలో అందుబాటులో ఉండదు’’ అని తెలిపింది.
బీమా ఉన్న డబ్బులు చెల్లింపు
నివేదికలోని మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బీమా ఉన్న కుటుంబాలలో 82 శాతం మంది ఇప్పటికీ తమ చేతి నుంచి కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. క్లెయిమ్‌లో సాధారణ ప్రసవానికి ప్రామాణిక పాలసీ పరిమితులు రూ. 50వేలుగా, సి-సెక్షన్‌కు రూ.75వేలుగా ఉంటాయని, వీటిని చాలా కాలంగా సవరించలేదని శ్రీ అరోరా అన్నారు. ‘‘మధ్యస్థ క్లెయిమ్‌లు సుమారు రూ.60 వేల నుంచి రూ.94 వేల మధ్య ఉంటున్నాయి. కాబట్టి ఒక సాధారణ ప్రసవం కూడా పరిమితిని దాటుతుంది. సమస్యలు ఖర్చులను మరింత పెంచుతాయి. పాలసీలో శిశువు పుట్టిన మొదటి రోజు కవరేజ్ లేకపోతే, నవజాత శిశువుకు అయ్యే ఎన్ఐసీయూ ఖర్చులు కూడా కుటుంబంపైనే పడతాయి. దీనివల్ల, బీమా ఉన్నప్పటికీ కుటుంబాలు తమ సొంత డబ్బుతో చెల్లించాల్సి వస్తుంది’’ అని అధ్యయనంలో తెలిపింది.
తమిళనాడులో తక్కువగా సి-సెక్షన్లు
తమిళనాడులో సి-సెక్షన్ల రేట్లు తక్కువగా ఉన్నాయి. ప్లమ్ డేటా ప్రకారం... తక్కువ వయస్సులోనే ప్రసవించే తల్లులు తమిళనాడులో చెన్నైలో 3 శాతం, కోయంబత్తూరులో 27 శాతం, మదురైలో 20 శాతం ఉన్నారు. 30 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న తల్లులు దాదాపు 60 శాతం ఉన్న ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు కంటే ఇక్కడ తక్కువగా సి- సెక్షన్లు జరుగుతున్నాయి. అయితే అత్యల్ప సి-సెక్షన్ రేట్లు కలిగిన నాలుగు నగరాలు తమిళనాడులోనే ఉన్నాయి. చెన్నై, కోయంబత్తూరు, సేలం , వెల్లూరు. వీటన్నింటిలో వెల్లూరులోనే అత్యల్పంగా ఉంది. ఇక్కడ కేవలం 34 శాతం ప్రసవాలు మాత్రమే సి-సెక్షన్ల ద్వారా జరుగుతున్నాయి.






కామెంట్లు (0)