మహిళల భద్రత, న్యాయవ్యవస్థపై తీవ్ర ప్రభావం ..
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు నిర్ణయంపై ఐద్వా తీవ్ర అసంతృప్తి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
గుజరాత్ బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన ఇద్దరికి బెయిల్ మంజూరు చేస్తూ, జీవిత ఖైదు శిక్షను సుప్రీంకోర్టు సస్పెండ్ చేయడంపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తీవ్ర అసంతృప్తి, నిరసన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం న్యాయానికి గొడ్డలిపెట్టువంటిదని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఐద్వా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.కె. శ్రీమతి, కనికా ఘోష్, న్యాయ సలహాదారు అడ్వకేట్ కీర్తి సింగ్ విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు కు సుప్రీంకోర్టు పేర్కొన్న కారణాలు అస్పష్టంగా, తగిన వివరణ లేకుండా ఉన్నాయని విమర్శించారు. ఒక దోషికి ఉన్న శారీరక వైకల్యం ఎంత తీవ్రంగా ఉందనే అంశాన్ని స్పష్టం చేయలేదని, మరో దోషి పేరును ఎఫ్ఐఆర్లో ఆలస్యంగా చేర్చడంపై సరైన వివరణ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ కారణాలు జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేయడానికి సమర్థనీయమైనవి కావని అన్నారు. గతంలో ఇదే కేసులో దోషులకు శిక్షా మినహాయింపు ఇవ్వాలన్న గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ శిక్షా మినహాయింపును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లలో ఐద్వా ఉపాధ్యక్షురాలు సుభాషిణి అలీ కూడా ఉన్నారని తెలిపారు. తాజా నిర్ణయం న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్కిస్ బానోకు న్యాయం చేయడం అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, దేశంలోని మహిళలందరి గౌరవం, భద్రత, న్యాయ హక్కులకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. బిల్కిస్ బానోకు, ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని, ఈ నిర్ణయాన్ని సవాలు చేసేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
బాధితురాలి వాదన వినాలి.. న్యాయం చేయాలి : ఎస్ఎఫ్ఐ డిమాండ్
బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల్లో ఇద్దరి జీవిత ఖైదు శిక్షలను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులు దిగ్భ్రాంతికరమని, ఆమోద యోగ్యం కాదని ఎస్ఎఫ్ఐ విమర్శించింది. బాధితురాలు బిల్కిస్ బానో వాదనను కోర్టు వినాలని, ప్రస్తుత ఉత్తర్వులను ఉపసంహరిం చుకుని ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం. సాజీ, భట్టాచార్య ప్రకటన విడుదల చేశారు. 2002లో గుజరాత్లో జరిగిన మత హింసాకాండ సందర్భంగా గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేయడంతో పాటు, ఆమె కుటుంబానికి చెందిన 14 మందిని హిందూత్వ మతోన్మాద మూకలు హత్య చేశాయని ఎస్ఎఫ్ఐ గుర్తుచేసింది. న్యాయం కోసం బాధితురాలు సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అయిన ప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ నుంచి వరుసగా నేరస్తులకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడటంతో బాధితురాలికి న్యాయం జరగకుండా పోయిందని విమర్శిం చింది.2022లో గుజరాత్ ప్రభుత్వం ఈ కేసులో దోషులుగా తేలిన మొత్తం 11మంది ని విడుదల చేయడం సిగ్గుచేటని పేర్కొంది. జైలు నుంచి బయటకు వచ్చిన దోషులకు సంఘ్ పరివార్ శక్తులు పూలమాలలు వేసి స్వాగతం పలకడాన్ని గుర్తుచేసింది.
తాజాగా ఇద్దరి శిక్షలను సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు బీజేపీ పాలనలో మైనారిటీలు అణగారిన వర్గాలపై రాజ్య ప్రేరేపిత హింసకు అనుకూలమైన వాతాబ వరణం నెలకొంటోం దనడానికి నిదర్శన మని విమర్శించింది. కేసులో చోటుచేసు కుంటున్న పరిణామాల గురించి బిల్కిస్ బానోకు సమాచారం ఇవ్వకపోవడం న్యాయ వ్యవస్థ అనుసరిస్తున్న లోపభూయిష్ట విధానా న్ని తెలియజేస్తోందని పేర్కొంది. బాధితురాలి గౌరవానికి, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చర్యగా అభివర్ణించింది. మతం, కులం, లింగం తదితర గుర్తింపుల ఆధారం గా ప్రజలపై వివక్ష, అణచివేత, దాడులు భారత సమాజంలో పెరుగుతున్నాయని, వీటికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. మోడీ ప్రభుత్వం వాగ్దానం చేసిన నూతన భారతదేశంలో బాధితులకు న్యాయం అందడం లేదని, మహిళలపై నేరాలకు పాల్పడే నేరస్తులు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడు తున్నాయని ఎస్ఎఫ్ఐ విమర్శిం చింది. బిల్కిస్ బానోకు న్యాయం జరిగే వరకు ఆమెకు అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. బాధితురాలి వాదనను వినాలని, ఇద్దరు దోషుల శిక్షలను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, బిల్కిస్ బానోకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.





కామెంట్లు (0)