Magazines

యూఎస్ జైళ్లల్లో భారతీయుల బాల్యం

1 గంట క్రితం

The Childhood of Indians in US Prisons
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 2 నిమిషాల చదవడం

​వలసల కట్టడి పేరుతో 1389 మంది నిర్బంధం

నాలుగేండ్లుగా జైళ్లలోనే...పట్టించుకోని ప్రధాని మోడీ

భారతదేశంలో మోడీ సర్కార్‌ ‌విధానాలతో బాల్యంపై అభద్రత పెరిగి, భవిష్యత్‌‌పై ఆశ సన్నగిల్లుతున్న తరుణంలో ‘తప్పు’ అని తెలిసినా, తప్పించుకొని అమెరికాకు వెళ్తే ఏదోలా బతికేయోచ్చు అనే భరోసా...
వెరసి 1389 మంది భారతీయ చిన్నారుల జీవితాలు అమెరికాలో జైలు పాలయ్యాయి. నాలుగేండ్లుగా 
అక్కడి నిర్భంధంలో అవస్థలు పడుతున్నారు. ‘మన్‌ ‌కీ బాత్‌...పరీక్షా పే చర్చా... బేటీ బచావ్‌, బేటీ పడావ్‌’’ వంటి స్లోగన్స్‌‌తో ఉపన్యాసాలు దంచికొట్టే ప్రధాని మోడీ మాత్రం నిర్భంధంలో ఉన్న చిన్నారుల గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలే లేవు. అమెరికా అధ్యక్షుడితో చెట్టాపట్టాల్‌ ‌వేసుకొని తిరిగినా, ఇలాంటి విషయాలు ప్రస్తావించే సాహాసం మాత్రం మోడీ సర్కార్‌ ‌చేయకపోవడం గమనార్హం! ఆ నిర్లక్ష్యం ఫలితంగా అమెరికా జైళ్లలో భారతీయ బాల్యం మగ్గుతోంది.


న్యూఢిల్లీ : అమెరికాలో అక్రమ వలసదారులపై చేపట్టిన కఠిన చర్యల ప్రభావం భారతీయ చిన్నారులపైనా పడుతోంది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు తల్లిదండ్రుల తోడు లేకుండా అమెరికాకుకు వచ్చిన 1389 మంది భారతీయ చిన్నారులను అక్కడి అధికారులు నిర్బంధించారు. అయితే వీరిలో ఒక్కరిని కూడా ఇప్పటివరకు భారత్‌కు వెనక్కి పంపలేదు. 2023 ఆర్థిక సంవత్సరంలో 730 మంది భారతీయ చిన్నారులు అమెరికా అధికారులకు పట్టుబడగా, 2024లో 517 మంది, 2025లో 91 మంది, 2026లో 51 మంది నిర్బంధానికి గురయ్యారు. అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (యూఎస్‌సీబీపీ) వెల్లడించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

​ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి

భారతీయ చిన్నారుల విషయంలోనే కాకుండా ఇతర దేశాల పిల్లల విషయంలోనూ అమెరికా ఇదే కఠిన వైఖరి అవలంబిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఒంటరిగా వచ్చిన 1.1 లక్షల మంది చిన్నారులను గుర్తించిన అమెరికా అధికారులు.. 2025లో 29,584 మందిని, 2026లో 9,190 మందిని గుర్తించారు. 2026 అక్టోబర్‌లో 722 మంది చిన్నారులు పట్టుబడ్డారు.

గ్రీన్‌ ‌కార్డు ఆశ

గ్రీన్‌కార్డు కోసం గతంలో కొందరు తల్లిదండ్రులు, బంధువులు చిన్నారులను అమెరికాకు పంపేవారని వలస వ్యవహారాలపై అవగాహన ఉన్నవారు చెప్తున్నారు. పిల్లలు ఒంటరిగా అమెరికాలోకి వస్తే తమకు చట్టబద్ధ నివాస హోదా పొందే అవకాశాలు మెరుగుపడతాయని భావించేవారు. అయితే ఇప్పుడు కఠిన తనిఖీల ఫలితంగా చిన్నారులు జైలుపాలవు తున్నారు.

బడికి దూరం

అమెరికాలో నివసిస్తున్న భారతీయ చిన్నారుల్లో బహిష్కరణ భయాలు పెరుగుతున్నాయి. 2012లో అమెరికా నుంచి బహిష్కరణకు గురైన గుజరాత్‌లోని కడి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కుమారుడు (17) ప్రస్తుతం టెక్సాస్‌లో నివసిస్తున్నాడు. ఆశ్రయం కోసం నిర్వహించే విచారణలకు హాజరైతే పట్టుకుని భారత్‌కు పంపిస్తారనే భయంతో తన కుమారుడు ఉన్నట్టు తండ్రి వెల్లడించాడు. రహస్యంగా గ్యాస్‌ స్టేషన్‌లో పనిచేస్తూ, ఓ మత వర్గానికి చెందినవారితో కలిసి నివసిస్తున్నాడని తెలిపాడు. మరోవైపు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిం చేందుకు ప్రయత్నిస్తున్నవారిలో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో 30,528 మంది భారతీయులు అమెరికా అధికారులకు పట్టుబడ్డారు. మెక్సికో, కెనడా తర్వాత ఈ స్థానంలో భారత్‌ నిలిచింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్