శెనగపిండి, రోజ్ వాటర్తో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల వివిధ రకాల చర్మసమస్యలను నివారించుకోవచ్చు. శెనగపిండిలోని నేచురల్ బ్యూటీ లక్షణాలు చర్మాన్ని నునుపుగా మార్చడంతో పాటు ముఖంలో గ్లో తీసుకొస్తాయి. ముఖ్యంగా ఈ రెండింటి కాంబినేషన్ ఫేస్ ప్యాక్ వల్ల ఫేషియల్ హెయిర్, మొటిమలు మరియు మరిన్ని ఇతర చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. మరి అన్ని ప్రయోజనాలను పొందాలంటే శెనగపిండి, రోజ్ వాటర్ ను ఏవిధంగా ఉపయోగించాలి. వీటి వల్ల ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం... ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శెనగపిండి తీసుకుని, దానికి కొద్దిగా రోజ్ వాటర్ కలపాలి. ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగి, తేమను పూర్తిగా తుడిచేసి, తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో సోప్ వాడకుండా శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే మొటిమలు బాగా తగ్గుతాయి. అంతేకాదు, మొటిమల ద్వారా వచ్చిన స్కార్స్ ను నివారిస్తుంది. శెనగపిండి, రోజ్ వాటర్ కాంబినేషన్ పేస్ట్ ను ప్రతి రోజూ ఉదయం అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముడతలను మాయం చేస్తుంది.







కామెంట్‌లు (0)