Magazines

సోమేశ్వరాలయాభివృద్ధికి రూ.20 కోట్లు

1 గంట క్రితం

Rs. 20 crore for the development of Someswara Temple
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 1 నిమిషాల చదవడం


మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

పానగల్‌లోని చారిత్రాత్మక ఛాయా సోమేశ్వరాలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేయడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆలయాభివృద్ధి కోసం సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావుకు కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఛాయా సోమేశ్వరాలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రపంచస్థాయిలో ఎక్కడా లేని విధంగా ‘వందల ఏండ్ల క్రితమే శిల్పులు కాంతి, నీడ, నిర్మాణ శాస్త్రాన్ని సమన్వయం చేసి శివలింగంపై నిరంతర ఛాయ కనిపించేలా నిర్మించిన ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణ శిల్పకళా వైభవానికి, ప్రాచీన నిర్మాణ విజ్ఞానానికి అద్భుత నిదర్శనం’ అని గుర్తు చేశారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చారిత్రక వారసత్వాన్ని కాపాడటంతో పాటు మరింత పర్యాటక ప్రాధాన్యత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి చొరవతో ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు కావటంలో భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్