సీసీఎల్‌ఏకు రాష్ర్ట బీసీ కమిషన్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ర్టంలో తొలగించిన కులాలపై జారీ చేయబడ్డ 2,123 కుల సర్టిఫికేట్లపై రెండు నెలల్లో విచారణ జరిపి వాటిని రద్దు చేయాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ర్టేషన్ (సీసీఎల్‌ఏ) కార్యదర్శి టి.వెంకట్‌ను రాష్ర్ట బీసీ కమిషన్ ఆదేశించింది. శనివారం హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో చైర్మెన్ జి.నిరంజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ర్టంలోని బీసీ సామాజిక వర్గాలు ఎదుర్కుంటున్న సమస్యలను చర్చించారు. నిజమాబాద్ జిల్లాలో విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీల ద్వారా కొన్ని కులాల వారిని బహిష్కరణ చేయడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ నెల 7న నిజమాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వేధింపులపై సమావేశం కావాలని కమిషన్ నిర్ణయించింది. లొద్ద కులస్థుల సామాజిక, విద్య, ఆర్థిక స్థితిగతుల అధ్యయనానికి సెస్ సంస్థ ద్వారా ప్రత్యేక సర్వే చేయించనున్నట్టు కమిషన్ వెల్లడించింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్క్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రెటరీ బి. బాల మాయ దేవి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తొలగించిన కులాల సర్టిఫికెట్లపై విచారణ జరపండి
41 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)