మేడిపల్లిలో టాటా గోల్డ్ షాపులో ఘటన
షట్టర్ తొలగించి లోపలికి చొరబడిన దుండగులు..
రూ.2 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు అపహరణకు గురైనట్టు సమాచారం
నవతెలంగాణ-డుప్పల్
మేడ్చల్‌జిల్లామల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్పరిధిలో భారీ చోరీ జరిగింది. కెనరా నగర్ బస్‌స్టాప్ సమీపంలో ఉన్న క్యారెట్ లేన్‌లోని టాటా గోల్డ్ జ్యువెలరీ షాపును దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు.సోమవారంతెల్లవారుజామున షట్టర్‌ను తొలగించి లోపలికి ప్రవేశించిన దొంగలు భారీ మొత్తంలో బంగారం, వజ్రాభరణాలను అపహరించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం.. సుమారు రూ.2 కోట్ల బంగారు, వజ్రాల ఆభరణాలు చోరీకి గురైనట్టు తెలుస్తోంది. చోరీ జరిగిన విషయాన్ని ఉదయం గుర్తించిన భవనం వాచ్‌మన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్,పోలీసులుఘటనాస్థలానికిచేరుకునిపరిశీలించారు.క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. పరిసర ప్రాంతాల్లో ఆధారాల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు, జ్యువెలరీ షాపులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు పరిసర ప్రాంతాల్లోని నిఘా కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు.ఇకఅపహరణకు గురైన ఆభరణాల అసలు విలువ, వాటి వివరాలపై పోలీసులు షాపు యాజమాన్యం నుంచి సమాచారం సేకరిస్తున్నారు.దాదాపు ఏడుగురు దుండగులు ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా సమాచారం. నిందితులు ఏ వాహనాల్లో వచ్చారు, ఏ మార్గంలో పరారయ్యారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుల ఆచూకీకోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






కామెంట్‌లు (0)