రోడ్ డ్యామేజ్ చార్జీల మాయాజాలం
వాహనదారుల నుంచి భారీగా వసూళ్లు
దారిమళ్లుతున్న నిధులు..మరమ్మతులకు నోచని రహదారులు..జిల్లాలకు చేరని రోడ్డు భద్రతా సొమ్ము
జనగాంలో తీర్మానమే చేసిన పాలకమండలి..కాగ్ ఆక్షేపించినా మారని సర్కారు తీరు..తాజాగా జీవో 48 విడుదల
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
'రోడ్డు భద్రత' దారి తప్పింది. ఆ పేరు చెప్పి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న వందల కోట్ల నిధులు దారిమళ్లుతున్నాయి. రహదారుల భద్రత కోసం ఖర్చు చేయాల్సిన నిధుల్ని ప్రభుత్వ జీఎస్టీ బకాయిలు, స్టేషనరీ కొనుగోళ్లు వంటి ఇతర అవసరాలకు వాడేసుకఁంటున్నారు. దీఁపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గతంలోనే తీవ్రంగా ఆక్షేపించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాకపోతే పాత నిబంధనల్నే మరోసారి కాగితంపై కొత్తగా రాసి జీవో నెంబర్ 48 పేరుతో సర్కారు విడుదల చేసింది. దీనిలో రోడ్డు భద్రతా నిధులపై 'కాగ్'తోనే ఆడిట్ చేయిస్తామని పేర్కొంది. ఆ జీవో లేకఁన్నా...ఇప్పటికే 'కాగ్' ఆ లెక్కల్ని ఆడిట్ చేస్తూనేఏ ఉంది. మళ్లీ కొత్తగా జీవో ఎందుకు ఇచ్చారనేది పాలకఁలకే తెలియాలి.రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకంగా నిధులు సమీకరిస్తున్న ప్రభుత్వం ఆ సొమ్మును వినియోగించి క్షేత్రస్థాయిలో వాహనదారులు, ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాలి. ప్రమాదకర ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, హెచ్చరిక బోర్డులు, వెలుతురు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ వంటి చర్యలకఁ రోడ్డు భద్రత నిధుల్ని ఖర్చు చేయాలి. కానీ ఇప్పటికీ ఈ ఖాతా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వసూళ్లు, జిల్లాల వారీ కేటాయింపులు, పనుల పురోగతిపై సమగ్ర లెక్కలు ప్రభుత్వం దగ్గర లేవు. దీనిపై గతంలోనూ, ఇప్పుడు పలువురు వ్యక్తులు, రవాణారంగ కార్మిక సంఘాలు సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తులు సుదీర్ఘకాలంగా మూలన పడి ఉన్నాయి. కొన్నింటికీ అరకొర సమాధానాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
భారీగా బాదుడు
ఈ ఏడాది (2026) మార్చి 1 నుంచి కొత్త వాహనాల తొలి రిజిస్ట్రేషన్పై రోడ్డు భద్రత సెస్ వసూలు చేయడానికి చట్టం చేశారు. దానిలో భాగంగా ద్విచక్ర వాహనానికి రూ.2 వేలు, తేలికపాటి మోటారు వాహనాఁకి రూ.5 వేలు, ఇతర వాహనాలకఁ రూ.10 వేలు చొప్పున ఒకేసారి సెస్ వసూలు చేసే విధానం అమల్లోకి వచ్చింది. ఈ సెస్ ద్వారా ఏడాదికి దాదాపు రూ.300 కోట్లు వరకు ఆదాయం వస్తుందని రవాణాశాఖ అంచనా వేసింది. దాన్ని రవాణాశాఖ ఆదాయంగా చూస్తున్నారే తప్ప, రోడ్ సేఫ్టీకి ఖర్చు చేయడాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి.
'కాగ్' హెచ్చరించినా..
తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎమ్డీసీఎల్) ఇసుక రవాణాకు సంబంధించిన 2016-17 నుంచి 2020-21 మధ్య ఐదేండ్లలో రోడ్డు డ్యామేజ్ ఛార్జీల (ఆర్డీసీ) వినియోగాన్ని 'కాగ్' పరిశీలించింది. దానిలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఐదేండ్లలో ఆర్డీసీ పేరుతో ప్రభుత్వం రూ. 171.32 కోట్లు వసూలు చేసింది. దానిలో రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారంగా రూ. 80 లక్షలు, రోడ్ల మరమ్మతులకు రూ.4.99 కోట్లు చేసినట్టు లెక్కలు తేలాయి. మిగిలిన రూ.165.98 కోట్ల సొమ్మును ఆదాయపు పన్ను, జీఎస్టీ, సాధారణ నిర్వహణ కోసం ఖర్చు చేసినట్టు గుర్తించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన మొత్తాలు ఆలస్యమవడంతో ఈ నిధులను తాత్కాలికంగా ఉపయోగించాల్సి వచ్చిందని రవాణాశాఖ అప్పుడు వివరణ ఇచ్చింది. కానీ ఆలస్యమైన నిధుల్ని మళ్లీ విడుదల చేశారా లేదా అనే ప్రశ్నకు ప్రభుత్వం 'కాగ్'కు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. నిర్దిష్ట ప్రయోజనం కోసం వసూలు చేసిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం సమర్థనీయం కాదని కాగ్ అప్పుడే అభ్యంతరం తెలిపింది.
కారణాలు శూన్యం
రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడానికి కారణాలు ఏంటి? ఏ రహదారులపై ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి? బ్లాక్స్పాట్ల వద్ద ఏ చర్యలు చేపట్టారు? వాటి ఫలితాలు బ్రహ్మపదార్థంగా మారాయి. రోడ్డు భద్రతా సెస్, రోడ్ డ్యామేజ్ చార్జీల నిధులు ఎక్కడికి వెళ్తున్నాయనే ప్రశ్నలకు సమాధానాలు లేవు.
ములుగు జిల్లాలో తీర్మానం
ములుగు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ 2026 సెప్టెంబరు 29న నిర్వహించిన సమావేశంలో ఇసుక లారీల రాకపోకలు, రోడ్ల పక్కన వాహనాల నిలుపుదల వల్ల తలెత్తుతున్న సమస్యలపై చర్చించారు. పస్రా-తాడ్వాయి, ఏటూరునాగారం-తాడ్వాయి మార్గాల్లో రద్దీ, వాహనాల పార్కింగ్ సమస్యలకు పరిష్కారంగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించడం, రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలు ప్రస్తావనకఁ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు తమ జిల్లాకు రోడ్డు భద్రతా నిధి జమ కాలేదని స్వయంగా అధికారులు పేర్కొన్నారు. వెంటనే ఆ నిధుల్ని విడుదల చేయాలని తీర్మానం కూడా చేశారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉంది.
పాత వ్యవస్థ ఉన్నా.. కొత్త జీఓ ఎందుకు?
రోడ్డు భద్రతా మండలి, శాఖల సమన్వయం కోసం తెలంగాణలో 2015 జనవరి 23న జీఓ ఎంఎస్ నెంబర్-4 విడుదలైంది. దాని ద్వారానే రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి ఏర్పడింది. అదే ఏడాది జూలై 22న జీఓ ఎంఎస్ నెంబర్ 26 ద్వారా లీడ్ ఏజెన్సీ ఏర్పాటు చేశారు. వీటిలో రోడ్డు భద్రతా నిధుల సమీకరణ, వ్యయంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని రవాణారంగ నిపుణులు చెప్తున్నారు. ప్రభుత్వం తాజాగా ఈనెల 17న విడుదలచేసిన జీవోలో నిధుల లావాదేవీల ఆన్లైన్ నమోదు, కాగ్ ఆడిట్, నెలవారీ జిల్లా కమిటీ సమావేశాలు, జిల్లా ప్రణాళికలపై మార్గదర్శకాలు ఇచ్చారు. పాత జీవోల్లోనూ ఈ విషయాలు స్పష్టంగా ఉన్నాయి.
లెక్కాపత్రం లేని ఖర్చు
రోడ్ సేఫ్టీ కోసం వసూలైన సొమ్ముతో చేసిన ఖర్చు, రోడ్డు ప్రమాదాల నివారణలో కనిపించాలి. కానీ ఆ సొమ్మును లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదకర మలుపులు, బ్లాక్ స్పాట్లలో రేడియం స్టిక్కర్లు అతికించాలి. రంబుల్ స్ట్రిప్స్, సూచిక బోర్డులు, సూర్యరశ్మితో పనిచేసే బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేయాలి. వాటిని ఏ ప్రాంతాల్లో అయితే ఏర్పాటు చేశామని రికార్డుల్లో పేర్కొంటున్నారో, అక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండటం గమనార్హం!
రూ.300 కోట్లు ఎక్కడ..?
రోడ్డు భద్రత సెస్ ద్వారా ఏడాదికి దాదాపు రూ.300 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. దానిలో రాష్ట్ర రోడ్డు భద్రత నిధికి ఎంత జమైంది? జిల్లాలకు ఎంత కేటాయించారు? ఎంత విడుదల చేశారు? ఏ ప్రమాద ప్రాంతాల్లో ఏ పనులకు ఖర్చు చేశారు? ఆ పనుల వల్ల ప్రమాదాలు తగ్గాయా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేవు.
పెరుగుతున్న ప్రమాదాలు
రోడ్ సేఫ్టీ పేరుతో ప్రభుత్వం వసూలు చేస్తున్న సొమ్మును దానికోసమే విఁయోగించట్లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. 2022లో రాష్ట్రంలో జరిగిన 21,619 రోడ్డు ప్రమాదాల్లో 7,559 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లో 22,903 ప్రమాదాలు జరగ్గా, మరణాలు 7,660కు చేరాయి. 2024లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 25,934కు పెరిగింది.






కామెంట్లు (0)