Magazines

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులను వేగవంతం చేయాలి

1 గంట క్రితం

Work on integrated schools must be expedited.

Work on integrated schools must be expedited.

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

ఫ్యూచర్ సిటీలో విదేశీ వర్సిటీల ఏర్పాటుకు ప్రత్యేక విధానం రూపొందించాలి : సమీక్షలో సీఎస్ సంజయ్ జాజు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను దేశించారు.. సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను దశలవారీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 డిసెంబర్ నాటికి 67 పాఠశాలలను పూర్తి చేయడంతో పాటు, 2028 జూన్ నాటికి ఈ సంఖ్యను 87కు పెంచేలా పనులను వేగవంతం చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రతి పాఠశాలను సుమారు 26 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక సదుపాయాలతో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. అవసరమైన క్రీడా మైదానాలు, వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్లు, ఆధునిక వంటశాలలు, డిజిటల్ తరగతి గదులు తదితర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశిత గడువుల్లో నాణ్యతా ప్రమాణాలతో పనులను పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పాఠశాలలు ఒకే క్యాంపస్ లో ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టారు. దేశంలో ఆదర్శవంతంగా ఉండే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు చేస్తున్నారు.
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఫ్యూచర్ సిటీలో ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. లండన్ యూనివర్సిటీ వంటి ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలను తెలంగాణకు ఆకర్షించేలా సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు లండన్ విశ్వవిద్యాలయం, బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయంతో పాటు మరో 4 అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఫ్యూచర్ సిటీలో తమ బ్రాంచీలు ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసాయని అధికారులు పేర్కొన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలను ఆహ్వానించడం, క్యాంపస్‌ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, పెట్టుబడులు, అనుమతులు, విద్యా కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలను ఈ విధానంలో పొందుపరచాలని అన్నారు. తెలంగాణలో ప్రపంచస్థాయి విద్యా అవకాశాలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాల విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సీఎస్ పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదిత అంతర్జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు సంబంధించి ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయాలతో సంప్రదింపులు జరిపి, గ్లోబల్ సమ్మిట్ సమయానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సి.ఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్ రంజన్, సబ్యసాచి ఘోష్, ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, యోగితా రాణా, రాహుల్ బొజ్జ, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ శ్రీదేవసేన, ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్