పూజా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘వ్యూ’. ఈ సినిమాకు ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో ప్రదీప్, సోనియా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాస్టర్ కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర, ప్రచుర కాంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్ పై సత్య చౌదరి నిర్మిస్తున్నారు. మహేశ్ కాంపెల్లి దర్శకుడు. ఈ సినిమాను ఈ నెల 20న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా బాపిరాజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ పూజా రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇలాంటి స్ట్రాంగ్ రోల్ నాకు కెరీర్ ప్రారంభంలోనే దక్కడం సంతోషంగా ఉంది. ట్రైలర్ లో ఎంత ఎనర్జీ ఉందో, సినిమాలోనూ అంతే ఎనర్జీ ఉంటుంది’ అని అన్నారు. ‘నేను ఈ సినిమా చేసి ప్రొడ్యూసర్ గా మీ ముందు ఉన్నానంటే కారణం మా డైరెక్టర్ మహేశ్. ప్రతి క్రాఫ్ట్ ను ఆయనే దగ్గరుండి చూసుకుంటా మంచి సినిమా చేశాడు.
మా బాపిరాజు సినిమాను రిలీజ్ చేసేందుకు రావడం సంతోషంగా ఉంది. శ్రీ లక్ష్మీ పిక్చర్స్, ప్రచుర కంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్ నాకు సపోర్ట్ గా నిలిచాయి. మంచి ఫీమేల్ ఒరియెంటెడ్ మూవీ ఇది. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని ప్రొడ్యూసర్ సత్య చౌదరి చెప్పారు.
డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు మాట్లాడుతూ,‘మంచి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టే ఈ చిత్రాన్ని మేము రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా చూసిన వారు వందమందికి బాగుందని చెబుతారు. అంటే ఒక టికెట్ కొన్న వాళ్లు వందమందితో టికెట్ కొనేలా చెబుతారు. దర్శకుడు మహేశ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇద్దరూ ఉన్నారు. ఆయనతో నేను ఒక మూవీ చేయాలనుకుంటున్నా’ అని తెలిపారు.
‘ప్రతి ఒక్కరికీ ఒక వ్యూ ఉంటుంది. ఈ కథ నా వ్యూ పాయింట్ లో నుంచి చెప్పింది. ఒక మంచి సినిమా చేశానని మాత్రం గర్వంగా చెప్పగలను. నా సినిమాలన్నీ మనం నిజంగా చూసినట్లు, మన ఇంట్లో, పొరుగింట్లో జరిగినట్లు ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటి ఫీల్ ను కలిగిస్తుంది’ అని డైరెక్టర్ మహేశ్ కాంపెల్లి అన్నారు.







కామెంట్లు (0)