హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ ‘సీన్’ చేస్తున్నారు.
నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా, నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ, ‘‘విశ్వనాథన్ అండ్ సన్స్’లో చాలా భాషలకు చెందిన నటీనటులు కలిసి పనిచేశారు. ఎక్కడికి వెళ్లినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకీ చాలా బ్యూటీఫుల్ ఫిల్మ్ ఇచ్చాడు. ఇప్పుడు జిత్తుతో కలిసి ‘సీన్’ చేశాను. తన ‘రోమాంచం’, ‘ఆవేశం’ సినిమాలను మీరు చూసే ఉంటారు. ‘
సీన్’ కూడా అలాంటి ఒక బ్యూటీఫుల్ సినిమా. ‘వీరభద్రుడు’, ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ తర్వాత మరోసారి మిమ్మల్ని కలవడం హ్యాపీగా ఉంది. ఇందులో మర్డర్ మిస్టరీ, మ్యాడ్నెస్, నవ్వులు.. అన్నీ ఉన్నాయి. రాకేందు మౌళి తెలుగులో చాలా చక్కని మాటలు, పాటలు రాశారు. ఈ సినిమాలో చాలా ఫ్రెష్ టాలెంట్ కూడా ఉంది. నజ్రియాతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తను నేచురల్ స్టార్. ఈ సినిమాలో తను స్టంట్స్ కూడా చేసింది. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఇందులో ఒక డైలాగ్ ఉంది. అది నిజంగా మీ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. మనపై మనం నమ్మకం ఉంచి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. ‘సీన్’ చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమాతో దీపావళిని సెలబ్రేట్ చేసుకుందాం. ఇది తప్పకుండా మీ అందరినీ మెప్పిస్తుంది’ అని చెప్పారు.
‘సీన్’తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ఖాయం : హీరో సూర్య
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది నవం 03, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్లు (0)