హీరో నాగ చైతన్య ఇంతకుముందెన్నడూ చూడని కొత్త పాత్రలో నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, సస్పెన్స్ కలయికతో ఒక భారీ సినిమాటిక్ స్పెక్టకల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పురాతన రహస్యాలు, మిస్టీరియస్ అంశాలతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఈనెల 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెల్లూరులోని 'ఎస్‌వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్'లో జరిగే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా, సత్య తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం: కార్తీక్ దండు, నిర్మాతలు: బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి, సమర్పణ: బాపినీడు, సంగీతం: అజనీష్ బి లోకనాథ్, సినిమాటోగ్రఫీ: రఘుల్ డి హెరియన్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహ చారి చెన్నోజు.







కామెంట్‌లు (0)