Magazines

ఆ సినిమాల స్థాయిలో అలరిస్తుంది

1 గంట క్రితం

films
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

‘‘ఆదర్శ కుటుంబం’ సినిమాను మేము చాలా కొత్తగా ప్రయత్నించాం. త్రివిక్రమ్ ఈ సినిమాను అద్భుతంగా మలిచారు. థియేటర్లలో ప్రేక్షకు లంతా గొప్ప అనుభూతిని పొందుతారు. ఈ సినిమా మిమ్మల్ని ఏ మాత్రం నిరాశపరచకుండా ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ సినిమాల స్థాయిలో అలరిస్తుందని నమ్ముతున్నాము. మేము కొత్తగా ప్రయత్నించిన ఈ ఆసక్తికర కుటుంబ కథా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని కథానాయకుడు వెంకటేష్‌ అన్నారు. వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన చిత్రం ‘ఆదర్శ కుటుం బం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. నేడు (శుక్రవారం) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో గురువారం గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దర్శకడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘మా సినిమా మీ అందరికీ నచ్చుతుందని, మీరందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తారని, ఆస్వాది స్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ సినిమాల తర్వాత ఓ అద్భుతమైన కథతో రావాలనే ఉద్దేశంతోనే ఇంత సమయం తీసుకున్నాను.ఇప్పుడు ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం’ అని తెలిపారు. నటుడు నారా రోహిత్ మాట్లాడుతూ, ‘ఈ సిని మాలో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు త్రివిక్రమ్ కి ధన్యవాదాలు.

వెంకటేష్ , త్రివిక్రమ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. ట్రైలర్ మీ అందరికీ నచ్చింది. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. ‘థియేటర్లకు వెళ్లి మా ఆదర్శ కుటుంబం సినిమా చూడండి. మీరంతా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం’ అని కథానాయిక శ్రీనిధి శెట్టి చెప్పారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, ‘త్రివిక్రమ్ కలం బలం గురించి అందరికీ తెలుసు. ఇంక్ తో అందరినీ థింక్ చేసేలా చేస్తారు. ఒక సీన్ ని తన మాటలతో గొప్పగా మలుస్తారు. ఎనిమిది పాట లతో జ్యూక్ బాక్స్ విడుదల చేశాం. అద్భుతమైన స్పందన లభిస్తోంది. సినిమా ఫైనల్ కాపీ చూసి మేమందరం ఎంతో ఆనందంగా ఉన్నాం. వెంకటేష్ లాంటి పాజిటివ్ వ్యక్తితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. శ్రీనిధి శెట్టి ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. నారా రోహిత్ అద్భుతంగా నటించారు’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్