Magazines

మా కెరీర్‌లో గర్వపడే సినిమా

5 గంటల క్రితం

proud
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 2 నిమిషాల చదవడం

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. శుక్రవారం థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తూ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తమ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ, ‘మేము ఈవెంట్స్ లో చెప్పినట్లు రశ్మిక, విజయ్ ఎపిసోడ్స్ అన్నింటికీ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. వారి సీన్స్ రియలెస్టిక్ ఫీల్ తో ఆథెంటిక్ గా ఉన్నాయని ప్రశంసలు వస్తున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్..ఇలా మేము ఎక్కడైతే ప్రేక్షకులు బాగా రెస్పాండ్ అవుతారని అనుకున్నామో అలాంటి అన్ని సందర్భాలకు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లో ప్రేక్షకుల స్పందన చూసి చాలా హ్యాపీగా ఫీలవుతున్నాం’ అని తెలిపారు. ‘ఈ రోజు ఉదయం నుంచే యూఎస్ నుంచి మంచి టాక్ విన్నాం. అలాగే ఏపీ, తెలంగాణలోని అన్ని ఏరియాల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. నేను థియేటర్స్ కు వెళ్లి అక్కడ ఆడియెన్స్ నుంచి వస్తున్న స్పందన చూసి హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమా విజయ్ కెరీర్ లో హ్యూజ్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం’ అని నిర్మాత నవీన్‌ యెర్నేని అన్నారు. డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ, ‘మేము సినిమా తీసిన ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆదరిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు థ్యాంక్స్’ అని తెలిపారు. హీరోయిన్ రశ్మిక మాట్లాడుతూ, ‘ఈ సినిమా కథ ఆకలి, జీవనపోరాటం, సంఘర్షణ, ప్రేమ వంటి అంశాలతో తెరకెక్కింది. తన వారి కోసం నిలబడిన ఒక గొప్ప వ్యక్తి కథతో తెరకెక్కింది’ అని అన్నారు. ‘ఇది ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ ఫిలిం అని చెప్పగలను. మా కెరీర్ లో గర్వపడే సినిమా అవుతుంది’ అని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్