Magazines

ఆద్యంతం హాస్యభరితం

54 నిమిషాల క్రితం

కామ్రేడ్ కళ్యాణ్
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోష నల్ ఎంటర్‌టైనర్‌ ‘కామ్రేడ్ కళ్యాణ్’తో హీరో శ్రీ విష్ణు అలరించబోతున్నారు. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా హీరో రవితేజ ఈ సినిమా టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు. విజయ్ బుల్గానిన్ ఫన్ ఫుల్ గా ఈ పాటను కంపోజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ వాయిస్‌తో పవర్‌ఫుల్ ఎనర్జీని అందించగా, భాస్కరభట్ల రాసిన లిరిక్స్ కామ్రేడ్ గా హీరో క్యారెక్టర్ ను ఎంటర్టైనింగ్ గా ప్రజెంట్ చేశాయి. విడుదలైన వెంటనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. శ్రీవిష్ణు, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల, సమర్పణ: కోన వెంకట్, నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి, సంగీతం: విజయ్ బుల్గానిన్, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఎడిటర్: చోటా కె. ప్రసాద్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్