చేతి చమురు వదిలితే చాలు
అబ్బో! మెడ నిండా దండలు
మనిషి మునిగేలా శాలువలు
కాపీకొట్టి కథరాసి మొదటిబహుమతి
కవితల ముక్కలు సేకరించి
ఆధునిక అర్థం కాని కవితతో
బుర్ర బద్దలు కొట్టే వారికి సన్మానం
వాటిని రాసిన రచయిత కవి శోషొచ్చి
కళ్లు బుర్ర తిరిగి పడే
తను పోటీకి పంపిన వాటినే
తస్కరించిన వారికే సన్మానాలు
విన్పడని ఆక్రోశం, జరుగుతున్న సన్నివేశం
అచ్యుతుని రాజ్యశ్రీ, 8985035283
సన్మానాలు
48 నిమిషాల క్రితం
balaji
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)