Magazines

‘రణబాలి’ చేసినందుకు గర్వపడుతున్నా..

4 గంటల క్రితం

Ranabali
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఘనంగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్ జరిగింది. ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ, ‘మా హీరోకి ఇది పర్పెక్ట్ మూవీ. ఇందులో విజయ్ నట విశ్వరూపం చూపించారు’ అని తెలిపారు. ‘మా డైరెక్టర్ రాహుల్ ఎంతో రీసెర్చ్ చేసి డీటెయిల్స్ సేకరించి ఈ సినిమాను రూపొందించాడు. మీరు సినిమా చూస్తున్నంత సేపు "రణబాలి" ప్రపంచంలోకి వెళ్లిపోతారు’ అని ప్రొడ్యూసర్ రవిశంకర్ చెప్పారు. డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ,‘‘రణబాలి’ అనే సినిమాను నేను గర్వంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను’ అని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ‘మనకు ఏ చరిత్ర తెలియకుండా దాచారో, ఏ వీరుల చరిత్ర తెలియకూడదు అనుకున్నారో, ఏ కథలు జానపథాల్లో, బుర్రకథల్లో చెబుతూ మనం మర్చిపోకుండా చేశారో, ఆ చరిత్రను సరిదిద్దే ప్రయత్నం ఈ అక్టోబర్ 16న రణబాలి చేయబోతున్నాడు. ఆ వీరులను సెలబ్రేట్ చేసే ప్రయత్నమే మా సినిమా. రాహుల్‌ ఈ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఇలాంటి గొప్ప సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను’ అని అన్నారు.


- హీరో విజయ్‌ దేవరకొండ

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్