Magazines

ఘనంగా 'ఇంటర్నేషనల్‌ ఇంక్‌ బౌండ్‌ 2.0' వేడుక

55 నిమిషాల క్రితం

కస్తూరి విజయం పబ్లిషర్స్‌
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

కస్తూరి విజయం పబ్లిషర్స్‌ సంస్థ నిర్వహించిన 'ఇంటర్నేషనల్‌ ఇంక్‌ బౌండ్‌ 2.0 వేడుక శనివారం ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. కస్తూరి విజయం సంస్థ వ్యవస్థాప కులు సుధీర్‌ పామిరెడ్డి ఆధ్యర్యంలో జరిగిన ఈ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రచయిత, నటుడు తనికెళ్ల భరణి, మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌లు ముఖ్య అతిథిలుగా హాజర్యయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ యజ్క్షాల రచనలో కస్తూరి విజయం పబ్లిషర్స్‌ ప్రచురించిన స్క్రీన్‌ప్లే మాస్టర్‌ సుకుమార్‌ పుస్తకం తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ల ఎడిషన్‌లతో పాటు ప్రముఖ రచయిత వంగూరి చిట్టేన్‌ రాజు రచించిన ‘అవేమైనా జ్క్షాపకాలా’ మర్చిపోవడానికి పుస్తకాలను వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఇదే వేడుకలో 48 కథల సంకలనం అమ్మమ్మ కథల ఖజానా పుస్తకాన్ని కూడా పబ్లిషర్స్‌ ఆ పుస్తక రచయితల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ,‘పుస్తకం మధుర జ్క్షాపకాల బాండాగారం. చిట్టేం రాజు ఈ పుస్తకంలో ఎన్నో విషయాలను ఆవిష్కరించారు. ఇక మనం మరిచిపోతున్న మన సంప్రదాయాలను కట్టు, బొట్టు, భాషలను ఈ పుస్తకంలో ఆయన గుర్తు చేశారు. ఇండియాలో కంటే ఎక్కువగా విదేశాల్లో మన సంప్రదాయాలను చక్కగా పాటిస్తున్నారు. ఇండియాలో ఉన్నవాళ్లు పాశ్చత్య సంస్కృతి పేరిట వింత పోకడలను అనుసరిస్తున్నారని ఆయన చెప్పారు. స్క్రీన్‌ప్లే మాస్టర్‌ సుకుమార్‌పై పుస్తకం రావడం అభినందనీయం. సినిమాలు వినోదంతో పాటు విజ్ఞానాన్నిఅందించాలి. హ్యుమర్‌, గ్రామర్‌ ఉంటే సినిమాకు గ్లామర్‌ వస్తుంది. ఈ దిశలో సినిమా ప్రముఖులు చొరవ తీసుకోవాలి’ అని అన్నారు. ‘సుధీర్‌ పామిరెడ్డి కుటుంబ సభ్యులు మంచి సాహిత్య ప్రియులు. స్క్రీన్‌ప్లే మాస్టర్‌ సుకుమార్‌ పుస్తకం రచించిన ప్రవీణ్ యజ్క్షాల నా ‘మిథునం’ సినిమా కథ-స్క్రీన్‌ప్లేపై తులనాత్మక పరిశోధనతో ఓ పుస్తకం తీసుకొచ్చాడు. ఇలాంటి పుస్తకాలు రావడం నేటి తరానికి ఎంతో అవసర’ అని నటుడు తనికెళ్ల భరణి చెప్పారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్