డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా, మహేష్ ఉప్పల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అనస్వర రాజన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ బిగ్ అప్డేట్ని రివీల్ చేశారు. అక్కినేని నాగార్జున సమర్పణలో ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు గ్రాండ్ గా రానుంది. నాగార్జున మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి మహేష్, అనీష్, వెంకీ వచ్చి గ్లింప్స్‌కు వాయిస్ ఓవర్ చెప్పమన్నారు. వాయిస్ ఓవర్ చెప్పాను. అనీష్‌తో తన తొలి సినిమాకే మూగవాడి క్యారెక్టర్ చేయడం నిజంగా చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ కథ గురించి అడిగాను. కథ చెప్పారు. వాళ్లు కథ మీద నమ్మకంతో సినిమాను అద్భుతంగా పూర్తి చేశారు. సినిమా మొత్తం చూశాను. నాకు చాలా నచ్చింది. బ్రిలియంట్ స్క్రీన్‌ప్లే. అనీష్ పెర్ఫార్మెన్స్ చూసి సర్ప్రైజ్ అయ్యాను. చాలా అద్భుతంగా నటించాడు. అనీష్, అనస్వర కెమిస్ట్రీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాతే డీఓపీ రాజాను నా ‘కింగ్ 100’ సినిమాకి పెట్టుకున్నాను. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా అంతా ట్విస్టులు, టర్న్స్‌తో నడుస్తూ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది. ఈ సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది’ అని చెప్పారు.
‘ఇట్లు అర్జున’ అద్భుతంగా ఉంది : నాగార్జున
5 గంటల క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)